వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ అందించిన ప్రతీ పాట ఓ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. ఈ పాటకు బన్ని, పూజా హెగ్డె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ కూడా ఈ పాటకు ఫిదా అయ్యాడు. దీంతో తన భార్య క్యాండిస్‌తో కలిసి బుట్టబొమ్మ పాటకు కాలు కదిపాడు వార్నర్‌. అంతేకాకుండా ఈ పాటకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అయింది.